Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు రాజా నీకేఈ స్తుతి ఆరాధననా Telugu Christian Song Lyrics

యేసు రాజా నీకేఈ స్తుతి ఆరాధననా Lyrics

యేసు రాజా నీకే
ఈ స్తుతి ఆరాధన
నా యేసు రాజా నీకే
నా స్తుతి సంకీర్తన
ఆరాధన స్తుతి ఆరాధన
సంకీర్తన స్తుతి స్తోత్రార్పణ (2) ||యేసు||
నీ మాటలో కరుణ
నీ చూపులో ఆదరణ
నీ ప్రేమలో రక్షణ
నీ కుడి చేతిలో దీవెన (2)
నీతోనే నిత్యానుబంధము
నీవే నా జీవిత గమ్యము (2) ||ఆరాధన||
జలములలో నే వెళ్లినా
అగ్నిలో నడిచినా
సుడి గాలులే ఎదురైనా
పెను తుఫానే చెలరేగినా (2)
నీ నామమే నను ధైర్యపరచును
నీ మాటలే నన్నాదరించును (2) ||ఆరాధన||

Your favourites

  • No Favourites found!