Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు రాజున్ నీ యెదలో వసియింప Telugu Christian Song Lyrics

యేసు రాజున్ నీ యెదలో వసియింప Lyrics

1. యేసు రాజున్ నీ యెదలో - వసియింప నీయవా?
నీదు భారమును మోసెన్ - నేడంగీకరింపవా?
యేసు మహారాజు ఇదిగో - వాకిట నిల్చియుండగా
పాపీ! యేసు ప్రేమనెంచి - తలుపును తీయుము
2. లోక ఆశా పాశముల - చేత నిండియున్నావా?
నీకై సిల్వన్ ప్రాణమిడిన - యేసుకు చోటులేదా?
3. ఇంక తామసించినచో - వెనుక మోసమగును
ఇపుడే రక్షణ దినము - వెనుక రక్షనబ్బదు
4. పిల్చినిల్చు రక్షకునికి - తలుపును తీయుము
నీదు జీవబలముల - నేడే సమర్పింపుము
5. రేపు యని తామసింప - నష్టము సల్గు సదా
మంచి సమయము వృధా - యగున్ కష్టపడెదవు
6. యోహాను మూడు పదహా-రును విశ్వసింపుము
దప్పిగొన్న వారిన్ పిల్చున్ - రూక కాసు లేకయే
7. హల్లెలూయ పాడుటకై - వల్లభుని యొద్దకురా
త్రోసివేయడెన్నడును - మంచి యేసునాథుడు


Your favourites

  • No Favourites found!