Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు రక్తములో నాకు జయమే జయము Telugu Christian Song Lyrics

యేసు రక్తములో నాకు జయమే జయము Lyrics

యేసు రక్తములో నాకు జయమే జయము
ప్రభు యేసు రక్తములో నిత్యం విజయం (2)
జయం జయం జయం జయం – నా యేసునిలో
జయం జయం జయం జయం – ప్రభుయేసు రక్తములో (2) ||యేసు రక్తములో||
పాపాలను క్షమియించి – శాపాలను భరియించి
విడుదలను కలిగించే యేసు రక్తము
మరణాన్ని తొలగించి – నరకాన్ని తప్పించి
పరలోకానికి చేర్చే యేసు రక్తము (2)
అమూల్యమైనది పవిత్రమైనది
ప్రశస్తమైనది నిష్కళంకమైనది (2) ||జయం జయం||

శోధనలలో జయమిచ్చి – బాధలో నెమ్మదినిచ్చి
ఆదరణను కలిగించే యేసు రక్తము
రోగాలను లయపరచి – వ్యాధులను దూరం చేసి
స్వస్థత నాకు చేకూర్చే యేసు రక్తము (2)
అమూల్యమైనది పవిత్రమైనది
ప్రశస్తమైనది నిష్కళంకమైనది (2) ||జయం జయం||

Your favourites

  • No Favourites found!