యేసు సర్వోన్నతుడా… క్రీస్తు సర్వశక్తిమంతుడా….
యేసు సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా
మానవుల రక్షించే మహా దేవుడా ||2||
నశియించినదానిని వెదకి రక్షించినావా ||2||
చితికిన బ్రతుకుల కన్నీరు తుడిచినావా ||2||
వందనమయ్యా నీకు వందనమయ్యా
యేసయ్యా.. వందనమయ్యా నీకు వందనమయ్యా ||2||
కానాను పురమున కళ్యాణ సమయాన ||2||
నీటిని ద్రాక్షా రసముగ మార్చి
విందును పసందుగా మార్చినావు ||2|| ||వందనమయ్యా||
నాయీను గ్రామాన విధవరాలి కుమారుని ||2||
పాడెను ప్రేమతో ముట్టి
కన్నతల్లి కన్నీరు తుడిచినావు ||2|| ||వందనమయ్యా||
గెరాసేను దేశాన సమాధుల స్థలములోన ||2||
సేన దయ్యమును వదిలించి
నశియించే ఆత్మను రక్షించినావు ||2|| ||వందనమయ్యా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసు సర్వోన్నతుడా… క్రీస్తు సర్వశక్తిమంతుడా….యేసు సర్వోన్నతుడా Lyrics
Your favourites
- No Favourites found!
