Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు శీఘ్రముగ తిరిగివచ్చున్ సత్యదేవుని వాక్యమిదే Telugu Christian Song Lyrics

యేసు శీఘ్రముగ తిరిగివచ్చున్ సత్యదేవుని వాక్యమిదే Lyrics

యేసు శీఘ్రముగ తిరిగివచ్చున్ - సత్యదేవుని వాక్యమిదే
ఆయన రాకడ అంత్య గుర్తులు - అన్నియు నెరవేరుచున్నవి
యేసు శీఘ్రముగ తిరిగివచ్చున్
1. పాపదుఃఖములు పెరుగుచున్నవి - యుద్దకలహములు వృద్ధియాయెను
జనముపై జనము లేచుచున్నది - రాజ్యముపై రాజ్యము లేచుచున్నది
2. భూకంపములు భువిని జరుగుచుండె - లోకమున తెగులు కరువు లున్నవి
ఆకసమున భయసూచనలు - వీక్షింతురు వింత సూచనలు
3. విశ్వాసులు పైకి ఎత్తబడన్ - యేసు పరమునుండి దిగివచ్చును
యేసునితో వెయ్యేండ్లు ఏలెదురు - ఆశతో కనిపెట్టుకొనువారలు
4. మారుమనస్సు నొందుమీ క్షణమే - కోరు యేసు రక్తాన కడుగుమని
ఈ రోజున నీవు సిద్ధపడుము - పరలోకమున ప్రవేశింతువు


Your favourites

  • No Favourites found!