Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసు వచ్చెడి వేళాయె సోదరులారా కాశమేఘములతోనుభాసురమగుతన Telugu Christian Song Lyrics

యేసు వచ్చెడి వేళాయె సోదరులారా కాశమేఘములతోనుభాసురమగుతన Lyrics

యేసు వచ్చెడి వేళాయె సోదరులారా కాశమేఘములతోను
భాసురమగుతన నివాసంబునకుమనల దీసుకపోయిప్రకాశితులను జేయ
||యేసు||

1. నిద్రమేల్కొను వేళాయె సమయము దెలిసి ఓరిమితో నుండరే భద్రముగా
శత్రుయుపద్రవమును దాటి సిద్ధపడుఁడి ప్రభునియొద్ద నివసించుటకు
||యేసు||

2. తనువును బలిపెట్టిన మన రక్షకుఁడు ఘన మహిమలోకి వెళ్లి తన
యింట స్థలములు మనకు సిద్ధముఁజేసి చనుదెంచు వేళాయె కనిపెట్టి
యుందాము. ||యేసు||

3. చాలారాత్రి గతించెను సోదరులారా వెలుగు సమీపించెను వేల
దూతలతోడ యేసయ్యవచ్చును కాలగురుతులగని మేలుకొనరెవేగ ||యేసు||

4. శోధన కాలమీదే యీధరణిలో బాధలురావచ్చును నాధుఁడైన
యేసుపాదముల కడనుండ యేది కీడుచేయలేదు మనపై నెపుడు ||యేసు||

5. మనలను బ్రేమించుచూ మన పాపముల దనరక్తమున గడుగుచు ఘన
దేవునికి నర్చకులనుజేసిన ప్రభుని కొనియాడి బలమహిమలను జెల్లింతుము
నిరత ||యేసు||

Your favourites

  • No Favourites found!