యేసు వస్త్రపు చెంగును మాత్రమే యాసించి ముట్టినట్టి దోసకారుల
రోగముల్ వెంటనే తొలఁగి పోయెను నిజముగ ||యేసు||
1. గుంపుకూడిన జనులతోఁ బ్రభు యేసు సొంపుతోఁ బోవునపుడు
తెంపుతో రమణి యొకతె ప్రభు చెంగు తెలియకుండను ముట్టెను ||యేసు||
2. అంతటను రక్తధార యామె కొ కింతైన లేకపోయె ఇంతలోఁ
ప్రభువు యెఱిఁగి తనయొక్క వింతఁ జూపెను జనులకు ||యేసు||
3. ప్రజలార మీలో నొకరిన్ నాదు ప్ర భావంబు స్వస్థపరచె నిజమంచుఁ
ప్రభువు చెప్పె వణుఁకుతో గజయాన వచ్చి నిల్చె ||యేసు||
4. ఒదుగుచుండిన వనితతో శ్రీయేసు అదురు మానుమి యింకను
ఇదిగో నీ విశ్వాసము రక్షించె ముదిత నెమ్మదిని వెళ్లు ||యేసు||
5. ఏపుమీరగ యేసును మీ యొక్క ప్రాపుగా నమ్ముకొనుఁడి ఆపదలు
దొలఁగించును నిజముగఁ పాపముక్తులఁ జేయును ||యేసు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసు వస్త్రపు చెంగును మాత్రమే యాసించి Lyrics
Your favourites
- No Favourites found!
