Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసుదేవా నను కొనిపోవా నీ రాజ్యముకై Telugu Christian Song Lyrics

యేసుదేవా నను కొనిపోవా నీ రాజ్యముకై Lyrics


యేసుదేవా నను కొనిపోవా నీ రాజ్యముకై వేచియున్నా
శాంతి లేని లోకాన నీ ప్రేమ కరువయ్యింది
శాంతి లేని లోకాన నీ ప్రేమ కనుమరుగయ్యింది
నీ రాక కోసమే నే ఎదురుచూస్తున్నాను అంతవరకు నీదు శక్తినిమ్మయా
నీ రాక కోసమే నే ఎదురుచూస్తున్నాను అంతవరకు నన్ను నీదు సాక్షిగా నిల్పుము

1. ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది
ఎటు తిరిగినా అన్యాయం ప్రబలి యుంది
నీ ప్రేమతో నను కాచి కాపాడు దేవా
నీ రాక వరకు నను నిలబెట్టు దేవా

2. నీ రాజ్యముకై ఈ లోకములో నీ కాడిని మోసెదను
నీవు ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలో చేర్చెదను
నీ ఆత్మ తోడుతో నను బ్రతికించుము నీ ఆత్మ శక్తితో నను బలపరచుము
నీ మహిమ రాజ్యమందు నీతో కూడా వసియించుటకు
కడ వరకు ఈ భువిలో నమ్మకంగా బ్రతికెదను

Your favourites

  • No Favourites found!