Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగనే యున్నాడు Telugu Christian Song Lyrics

యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగనే యున్నాడు Lyrics

యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగనే యున్నాడు
యుగయుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును
1. అన్నిటికంటె ముందుగ నున్న - అల్ఫాగ తానై యుండి
తనయందు మనల పూర్ణులజేసె - ఓమెగ తానైయుండి
2. లోకము పుట్టక మునుపే తాను మహిమలో తండ్రితో నుండె
ప్రేమను పొందిన తానే మనకై - శాశ్వత ప్రేమను జూపె
3. అనేకులైన కుమారులను - మహిమకు తెచ్చుటకై
రక్షణ కర్తను శ్రమల ద్వారా - సంపూర్ణుని జేసె తండ్రి
4. జగదుత్పత్తి మొదలుకొని - వధియింప బడియున్న
దేవుని గొర్రెపిల్లగ తానై - పరమందారాధన నొందు
5. నిత్యము నిలచు తన నామంబు - నూతన సృష్టియందు
తన సేవకుల సంతతి తనతో - తరతరముల వరకుండున్
6. అధికంబైన కృప మహిమన్ - యుగయుగములయందు జూపన్
మనలను లేపి కూర్చుండబెట్టె - క్రీస్తుతో మన తండ్రి
7. ఇట్టి మహిమన్ పొందుటకై - మనమంత తనతో గూడ
శిబిరము వెలుపట నిందల నోర్చి - వెళ్ళుద మాయనతో


Your favourites

  • No Favourites found!