Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసునాధుని సేవ యిపుడు మాకబ్బెను వెఱవము Telugu Christian Song Lyrics

యేసునాధుని సేవ యిపుడు మాకబ్బెను వెఱవము Lyrics

యేసునాధుని సేవ యిపుడు మాకబ్బెను వెఱవము వెఱవము యేసు
దాసులతో బొత్తు భక్తి మా కమరెను జడియము జడియము ||యేసు||

1. లోక జ్ఞానములోని లోతుఁ దెలిసి మేము లొంగము లొంగము
యేసు రాకడకొఱకు సంత సించి యెల్లప్పు డుండెద ముండెదము
||యేసు||

2. దైవజనుల మని ధైర్యముతో మేము పల్కెదము పల్కెదము పాప
భారమంతయు యేసు ప్రభున కప్పగించి బ్రతుకుచు బ్రతుకుచు ||యేసు||

3. శుభవర్తమానము సొంపుగా నరులకుఁ జెప్పెదము జెప్పెదము లోక
వైభవములను వాంఛించక యేసుని పలికెదము పలికెదము ||యేసు||

4. నీతికవచంబును నెనరుతో ధరియించి నిలిచెదము నిలిచెదము లోక
ఘాతకుఁడైన పి శాచిని యెదిరించి కట్టెదము కట్టెదము ||యేసు||

5. శోక మొందక యేసు రాకడ కాశించి రంజిల్లు చుండెదము దూత
మూఁకలతో గూడి మోద మొప్ప యేసుని పొగడెదము పొగడెదము
||యేసు||

Your favourites

  • No Favourites found!