Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసునాధుని సిలువపైని వేసి శ్రమఁబొదించినది నా Telugu Christian Song Lyrics

యేసునాధుని సిలువపైని వేసి శ్రమఁబొదించినది నా Lyrics

యేసునాధుని సిలువపైని వేసి శ్రమఁబొదించినది నా దోసమే
దుస్సహ వాసమే ||యేసు||

1. కంటక కిరీట మౌదల నంటగొట్టించినది నాచెడు తలఁపులే
పాపపు పలుకులే ||యేసు||

2. మృదుకరంబుల మేకులందింపి నదితలఁప నా హస్తకృత కా ర్యంబులే
దుష్క ర్మంబులే ||యేసు||

3. పాదయుగమున నాటిచీలలు బాధ నొందించినది నా చెడు నడకలే
దోసపు పడకలే ||యేసు||

4. దాహముం గొనఁజేదు చిరకను ద్రావదలఁచినది మధుపానా సక్తియే
యందను రక్తియే ||యేసు||

5. హెచ్చుగ లోహిత పతనముగఁ గ్రుచ్చిన కుంతంబు నా పా పేచ్ఛలే
హృదయదు రేచ్ఛలే ||యేసు||

6. పావనగాత్రంబు క్షతమయ మై వెతలపాల్జేసినది నా దేహమే యఘ
సం దోహమే ||యేసు||

7. దీనిఁగని నా మానసాబ్జము లోని కలుషము దూరపర్చక నడుతునా
ధారుణిఁ గడుతు నా ||యేసు||

Your favourites

  • No Favourites found!