యేసుని భజియింపవే మనసా నీ దోసములు చనఁ జేసి కృపతోఁ
బ్రోచునే మనసా వాసి కెక్కిన క్రీస్తు మోక్షని వాసిగా కిఁక వేరేలేరని
దోసిలొగ్గి నుతించితే నిను త్రోసివేయఁడు దోసకారని ||యేసు||
1. ఏటికే నీ కీదురాశలు నీ కెప్పుదును చెవి నాటవుగ ప్రభు యేసు
వాక్యములు వాటముగ నా తుది దినమున నీటుమీఱఁగ నిత్యజీవ కి
రీటమును నీకిత్తు నని తన నోటఁ బల్కిన మాటఁ దప్పఁడు||యేసు||
2. ఖండనగ నిను చెండియాడఁడు యెల్లప్పుడుందన మిత్రుడని రక్షించు
నతఁడితఁడు అండఁబాయక నిన్ను ప్రతి దిన గండములను హరించునని
నీ వుండ గోరిన నిండు నెమ్మది దండిఁగ నీకుండఁ జెప్పును||యేసు||
3. లోక సైతాను దుర్భోధలు నీ వాలింపక యా లోకరక్షకుని సుబోధలు
ఏక మనసుతో రాత్రిఁబగలు ప రాకులేకను గాచు నా ప్రభు రాకడను
నీవెఱింగినను పర లోకశుభ సుఖసౌఖ్య మొసఁగును||యేసు||
4. వంచనలు మది నుంచకే మనసా నీ దుర్గుణము తలఁ ద్రుంచి ప్రభుని
సేవింపనే మనసా అంచితముగా క్రీస్తుఁ డీప్ర పంచ జనుల భవాబ్ధినావగ
నెంచి నీ భవభార మతనిపై నుంచి సతము ప్రార్థించు మనసా||యేసు||
5. నిన్ను పాప బంధముల నుండి రక్షించుటకు స ర్వోన్నతుని కుమారుఁ
డై వెలసి ఎన్నఁగ నీవొందు దుఃఖము లన్నిటిని తా ననుభవించెను
విన్న తక్షణ మేసుక్రీస్తుని విశ్వసించి సుఖించు మనసా||యేసు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసుని భజియింపవే మనసా నీ దోసములు Lyrics
Your favourites
- No Favourites found!
