Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసుని నామములో – మన బాధలు Telugu Christian Song Lyrics

యేసుని నామములో – మన బాధలు Lyrics


యేసుని నామములో – మన బాధలు పోవును
దుష్టాత్మలు పారిపోవును
శోధనలో జయమొచ్చును
మృతులకు నిండు జీవమొచ్చును
హృదయములో నెమ్మదొచ్చును
యేసు రక్తముకే – యేసు నామముకే
యుగయుగములకూ మహిమే
అభిషిక్తులగు తన దాసులకు
ప్రతి సమయమునా జయమే    ||యేసుని||

ఘోరమైన వ్యాధులెన్నైనా
మార్పులేని వ్యసనపరులైనా
ఆర్ధికముగా లోటులెన్నున్నా
ఆశలు నిరాశలే ఐనా
ప్రభుయేసుని నమ్మినచో – నీవు విడుదలనొందెదవు
పరివర్తన చెందినచో – పరలోకం చేరెదవు            ||యేసు రక్తముకే ||

రాజువైనా యాజకుడవైనా
నిరుపేదవైనా బ్రతుకు చెడివున్నా
ఆశ్రయముగా గృహములెన్నున్నా
నిలువ నీడే నీకు లేకున్నా
శ్రీ యేసుని నామమున – విశ్వాసము నీకున్నా
నీ స్థితి నేడేదైనా – నిత్యజీవము పొందెదవు         ||యేసు రక్తముకే ||

Your favourites

  • No Favourites found!