Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసుని రాజ్యము అది నిశ్చలమైనది తరతరములకు Telugu Christian Song Lyrics

యేసుని రాజ్యము అది నిశ్చలమైనది తరతరములకు Lyrics

యేసుని రాజ్యము అది నిశ్చలమైనది (2)
తరతరములకు యుగయుగములకు మార్పులేనిది
పరిశుద్ధులందరు స్తుతులు చెల్లించే మహిమ రాజ్యమది (2)
1. ప్రకాశమైన రాజ్యము - పరిశుద్ధులకె స్థానము (2)
కన్నీరు లేని రాజ్యము - మరణము లేని రాజ్యము (2)
ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే (2)
2. భోజనపానము కాని ఉత్తమమైన రాజ్యము - నీతి సమాధాన రాజ్యము
సూర్యచంద్రులు లేని రాజ్యము
ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే
3. జయించు వారిదే రాజ్యము - నీతిమంతులదే కిరీటము
జీవజలనది పారును - దేవుడే వాటిని త్రాగనిచ్చును
ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే
4. శాపము లేని రాజ్యము - గొర్రెపిల్ల ఉండు రాజ్యము
మన ప్రభువే ప్రకాశించును - యుగయుగములు పరిపాలించున్
ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లప్పుడు సంతోషమే
5. క్రీస్తుని రాక ఏ క్షణమో - ఎదుర్కొన నీవు సంసిద్ధమా
నేడే యేసుని స్వీకరించు - క్రీస్తుకై నీవు జీవించుమా
ఎల్లప్పుడు ఆనందమే - ఎల్లపుడు సంతోషమే


Your favourites

  • No Favourites found!