Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసుని సేవింప దయచేసితివి ప్రేమస్వరూప యేసుని Telugu Christian Song Lyrics

యేసుని సేవింప దయచేసితివి ప్రేమస్వరూప యేసుని Lyrics

యేసుని సేవింప దయచేసితివి ప్రేమస్వరూప యేసుని దాసులనందరిని
దరి జేర్చుటకును వాసికెక్కి పరవాసము చేసెడి ||యేసుని||

1. ఆదియందు భూమ్యాకాశంబుల శక్తి ఆత్మ నింపార సృజించిన ||యేసుని||

2. శత్రువులగు జనసంఖ్యను బొడగని మిత్రుడగుచు దనమేను నొసంగిన
||యేసుని||

3. పాపులెల్ల దనప్రాపుగోరుకొని దాపుగరండని దయచేఁ బిల్చెడి ||యేసుని||

4. సకల శుభంబులు చక్కఁగ నిచ్చుచు సకలభక్తులను సమముగఁ జూచెడి
||యేసుని||

5. తన్ను నమ్ముకొని యున్న దీనులకు దన్నుగ నుండెడి సన్నుతుడగుమా
||యేసుని||

6. చక్కని గుణములు లెక్కలేక తన చక్కని యాత్మను చిక్కగఁబట్టిన ||యేసుని||

7. లోకమంతయును లోఁబడుచుండఁగ నేక ప్రభువై యేలుచుండుమా
||యేసుని||

Your favourites

  • No Favourites found!