Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసుని శ్రమలతోడ ఆశతో పాలు పొందెదనుఅను Telugu Christian Song Lyrics

యేసుని శ్రమలతోడ ఆశతో పాలు పొందెదనుఅను Lyrics

యేసుని శ్రమలతోడ - ఆశతో పాలు పొందెదను
అను ఇతని ఓదార్పు నిజము - ఇతర ఓదార్పు వృథయే
1. నిందలెల్ల ఏకముగా - మహామహునిమీద బడగా
వింతగానే యోర్చుకొనెను - తండ్రి మాట నేరవేర్చెన్
2. దుఃఖముతో నిండియుండెన్ - ప్రక్కలోన గ్రుచ్చబడెను
రక్తితోడయోర్చుకొని వి - రక్తి మాట పల్కకుండెన్
3. శోకంబు చెత నేను - నాకంబు కదిలింతును
రక్తంబుధార పోసెన్ - రిక్తులమైన మనకు
4. సదయుని రక్తముచే - హృదయాలంకారముచే
కలుగు నాహారమిదే - ఎల్లరకు శ్రేష్టాహారం
5. తల్లి ప్రేమకన్న మిగుల - తన ప్రేమ చూపె మనకై
నోటి మాటతోడ శత్రున్ - కోటల నశింపజేసెన్
6. నా యేసు రక్తచెమట - నాయప్పు యంతయున్ తీర్చెన్
ఎల్లరికి నగీకారమిదే - ఎల్లప్పుడు నా ధ్యానమున్
7. హల్లెలూయా గీతమును - ఎల్లపుడు చాటుచుందున్
ఎల్లరియందు తానే - ఎల్లప్పుడు వసించున్


Your favourites

  • No Favourites found!