Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసుని వాగ్దానముల్ జ్ఞాపకమునందుంచుకొని తుఫాను వీచిన Telugu Christian Song Lyrics

యేసుని వాగ్దానముల్ జ్ఞాపకమునందుంచుకొని తుఫాను వీచిన Lyrics

యేసుని వాగ్దానముల్ - జ్ఞాపకమునందుంచుకొని
తుఫాను వీచిన శ్రమలున్న - నా చాటున నేనుండెద
1. ద్వేషము ఈర్ష్యలోకములో - అత్యధిక ప్రేమ నీలో
అంధకారపు లోకములో - నీవే దివ్యజ్యోతివి
అంధకార పాపమందు - నీవే సత్యమార్గము
భరియింపరాని మరణపు బాధలో - నీవే సత్యదేవుడవు
2. శక్తిహీనుడనై యుంటి - నీవే నాదు సహాయుడవు
కృంగియున్న సమయములో - తండ్రిగ కౌగిట చేర్చితివి
నిత్యజీవిత వసరములను - తీర్చువాడవు నీవేగా
బాధలోహింస శ్రమలయందు - నిత్యము ఆనందింతును
3. జగమున యుద్ధ కలహములు - శాంతిలేనే లేదచట
యేసు ప్రభువా నీ ద్వారా - ఆనందభరితుడ నైతిని
ఘోరమౌ తుఫాను లేవ - హృదయము కంపించెను భీతిన్
భయపడకుడని ప్రభువే పల్క - నిమ్మళించెను తుఫాను


Your favourites

  • No Favourites found!