Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసుని వెంట నేను వెంబడించుచున్నాను నా Telugu Christian Song Lyrics

యేసుని వెంట నేను వెంబడించుచున్నాను నా Lyrics

యేసుని వెంట నేను - వెంబడించుచున్నాను (1)
నా సిలువను మోయుచు నేను - వెంబడించుచున్నాను (1)
అను తన హృదయానుసారునిగా
ఉండుటకు సిద్ధపడుచున్నాను
1. ఎంతో అద్భుతమైనది - నా ప్రభుని బలియాగం (2)
సాదృశ్యముగ నా కొరకై
ప్రాణమర్పించెను - ప్రాణమర్పించెను
నా ప్రభుని తలచుచు నేను - వెంబడించుచున్నాను (2)
2. ఈ లోక సౌదర్యము - నన్ను మోసగించదు
సాతాను యుక్తులన్నియు
నా మీద పనిచేయవు - నా మీద పనిచేయవు
యేసుని స్వరము వినుచూ - వెంబడించుచున్నాను
3. ఎంతో అద్భుతమైనది - నా ప్రభు నన్ను శిక్షించుట
ప్రభు నన్ను సరిచేయుట
తన ప్రేమయై యున్నది - తన ప్రేమయై యున్నది
యేసుని స్వరము వినుచూ - వెంబడించుచున్నాను
4. ఇబ్బందులెన్నో కలిగిన నా దృష్టి ప్రభు మీదనే
శ్రమలే మాత్రము కదల్చవు
అద్దరి అగుపడుచున్నది - అద్దరి అగుపడుచున్నది
శీఘ్రముగానే చేరుటకు - వెంబడించుచున్నాను
5. తన చిత్తములో నన్నుంచి - నా ప్రభు సంతోషించును
మంచి మాటలన్నియు నేర్పి
నను సిద్ధపరచుచున్నాడు - నను సిద్ధపరచుచున్నాడు
మహిమను పొందుటకు నేను - వెంబడించుచున్నాను


Your favourites

  • No Favourites found!