యేసును చూచుట యెన్నటికో పర వాసుఁడ నగుట యెన్నటికో
భాసురముగ నా పరమ జనకు సిం హాసనమున దూ తాదుల మధ్యను
||యేసును||
1. బలితంబగు పైశాచక బంధన పాశము వదులుట యెన్నటికో సలలి
తముగ నా సద్గురు పాద స్థలమున కరఁగుట యెన్నటికో ||యేసును||
2. ధాత్రిఁ గష్ట దుఃఖాబ్ధిని మన మిఁక ధాటిగ దాఁటుట యెన్నటికో
మైత్రితోడఁ బర మాత్ముని చెంతను మనసు తీర మను టెన్నటికో ||యేసును||
3. కాంచనమకుటము కనకపు వీణెయు ఘనముగఁ దాల్చుట యెన్న టికో
యంచితముగ హలె లూయా పాటల నానందించుట
యెన్నటికో ||యేసును||
4. శోధన బాధల నీ ధరఁ బొందక శోకము గెల్చుట యెన్నటికో సాధూత్తమ
జన సాంగత్యమ్మున సంతస మొందుట యెన్నటికో ||యేసును||
5. నీతి రహిత పైశాచిక భటగణ నిందలు బాయుట యెన్నటికో ఖ్యాతిగ
శ్రీ పర మాత్ముని కొలువున గట్టిగఁ గుదురుట యెన్నటికో ||యేసును||
6. జరయు వ్యాధి సంశోక మరణములు జొరని చోటుండుట యెన్న టికో
పరిశుద్ధతయును బరమానందము ప్రబలు పదము జేరు టెన్నటికో
||యేసును||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసును చూచుట యెన్నటికో పర వాసుఁడ Lyrics
Your favourites
- No Favourites found!
