Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసుప్రభుకై సాక్షులెవరెవరో ఎవ్వరెవ్వరో యని యాశతో Telugu Christian Song Lyrics

యేసుప్రభుకై సాక్షులెవరెవరో ఎవ్వరెవ్వరో యని యాశతో Lyrics

యేసుప్రభుకై సాక్షులెవరెవరో ఎవ్వరెవ్వరో యని యాశతో ప్రభు
వడుగుచున్నాడు యేసు కొరకై నిల్చి క్రైస్తవ యువకులెల్లరు సాక్ష్యమిచ్చుచు
భాసురంబుగ క్రీస్తు నెంతో భారతీయులు ప్రస్తుతించరో ||యేసు||

1. దేవదర్శన మొంది లేలెండి ధనజనులకెల్లను దైవ ప్రేమను గూర్చి
దెలుపండీ పావనుండగు ప్రభుని బోధలు పాడి రక్షణ మార్గమెల్లను
సావధానముతోడ దెల్పరే సౌలు మారి పౌలెటాయెనో ||యేసు||

2. రాయబారుల మంచు నమ్మండి రారాజు వార్తలు రేయిబవలును
దెలుప లేలెండీ పాయకుండగ యేసు తన విమ లాత్మ నెప్పుడు తోడ
నుంచును పాపులెల్లరు యేసు ప్రభుని పాదములు సేవించి బ్రతుకగ
||యేసు||

3. థీరులై శుభవార్త జాటండీ దినదినము వాక్య ప్రచారమెల్లను చేయ
లేలెండీ చేయవలసిన దెల్ల ప్రభువే చేయు మీతో నాత్మరూపున
జయము మీదను జయమునిచ్చి జగతిని దగ వెలుగ జేయగ ||యేసు||

4. పౌలు మాదిరి బోలి లేలెండీ పరలోక రాజ్య ప్రచారమెల్లను జేయలేలెండీ
పలువిధంబుల శ్రమలకోర్చి ప్రభువు శత్రుల నెల్ల మాడ్చి సిలువ
ధ్వజమును చేతబట్టి సుస్థిరంబగు సేవ జేయగ ||యేసు||

Your favourites

  • No Favourites found!