Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసుప్రభువు యెరూషలేము ప్రవేశించిన విధము భాసురముగ Telugu Christian Song Lyrics

యేసుప్రభువు యెరూషలేము ప్రవేశించిన విధము భాసురముగ Lyrics

యేసుప్రభువు యెరూషలేము ప్రవేశించిన విధము భాసురముగ తన
మహిమ చూడగా జేసెను ఆ దినము ||యేసు||

1. భారవాహక గార్ధభమెక్కి బాహాటముగాను బయలుదేరెను జేజేలనగా
ప్రియమొప్పగతాను ||యేసు||

2. గట్గి పాడుచు గంతులు వేయుచు అట్టహాసముతో కొట్టుచు
కరతాళములను పెద్దగా కూరిమి చూపిరిగా ||యేసు||

3. పిల్లలు పెద్దలు మెల్లగ బోవుచు ఉల్లాసముతోను చల్లని ప్రభువని
జయములు గొట్టిరి సంతోషముతోను ||యేసు||

4. కొందరు మూర్ఖులు తొందర చేయుచు ముందుకు వచ్చిరిగా అందరు
మానిన అరచును రాళ్లని అపుడా ప్రభువనగా ||యేసు||

5. చిగురుటాకు చెట్ల కొమ్మలను సొగసుగ మార్గములో బాగుగ పరిరచిరి
భక్తిని చూపిరి సాగుచు జనులంతా ||యేసు||

6. యెరూషలేము గతిగని ప్రభువు ఏడ్చెను ఎలుగెత్తి మరియు యెరుషలేం
దేవాలయమును పరిశుభ్రత చేసె ||యేసు||

7. మనలోనున్న పాపము లెల్ల మనుపును ఆ ప్రభువే ఘనకృపశాంతులు
గల్గించియు మరి ననయము బ్రోచునిలన్ ||యేసు||

Your favourites

  • No Favourites found!