Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసురాజు నీదు ప్రేమ నెంచ తరముగాదయా Telugu Christian Song Lyrics

యేసురాజు నీదు ప్రేమ నెంచ తరముగాదయా Lyrics

యేసురాజు నీదు ప్రేమ నెంచ తరముగాదయా దోషియైన నన్ను బ్రోవ
నీసుప్రాణమిడితివా ||యేసురాజా||

1. మంచివాని కొరకు నొకఁడు మరణ మొందుటరుదుగా అంచితమగు
ప్రేమ చేత మించి గాయము లొందినా ||వేసు||

2. చెయ్యరాని దుష్కర్మములుఁ చేసి నే చెడియుండగా అయ్యో మ్రానుమీఁ
దికీవు ఇయ్యకొని మోసితివా ||యేసు||

3. గెత్సేమనె వనములోకిఁ జొచ్చి తండ్రికి చిత్తమై యిచ్చిన నా శ్రమలపాత్రన్
బుచ్చుకొని భరించినా ||వేసు||

4. హస్తము,పాదము,ప్రక్కలు మస్తకపు గాయములలో విస్తరించి చిందె నీ
ప్ర శస్త రక్తమంతయున్ ||యేసు||

5. కొండమీద నిన్నుఁజూడ గుండెలదిరిపోవునే నిండు ప్రేమ చేత నావగు
మెండుబాధల నోర్చినా ||వేసురాజా||

6. మరువలేను నీదు ప్రేమ మరణపరియంతంబు నా నరక బాధలన్ని
నీవా కొరతపై వహించినా ||వేసురాజా||

7. నిన్నుదలఁచ నా నిరీక్షణ యున్నతము గానుండును యెన్నడు నీ
మహిమను నా కన్నులారఁజూతునో ||యేసురాజా||

Your favourites

  • No Favourites found!