Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసుతో ఠీవిగాను పోదమా! అడ్డుగా వచ్చు Telugu Christian Song Lyrics

యేసుతో ఠీవిగాను పోదమా! అడ్డుగా వచ్చు Lyrics

యేసుతో ఠీవిగాను పోదమా! అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో
బోదము ||యేసుతో||

1. రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవచేయను యేసు రాజు
ముందుగా ధ్వజము బట్టి నడువగా యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో||

2. విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు
అనుదినంబు శక్తిని బొందుచున్నవారమై యేసుతో ఠీవిగాను వెడలను
||యేసుతో||

3. శోధనలు మనల చుట్టివచ్చినా సాతాను అంబులెన్ని తగిలినా
భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము యేసుతో ఠీవిగాను
వెడలను ||యేసుతో||

4. ఓ యువతి యువకులారా చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి లోకమంత
యేకమై యేసునాధు గొల్వను సాధనంబెవరు నీవు నేనెగా ||యేసుతో||

Your favourites

  • No Favourites found!