యేసూ నా యాత్మ రక్షకుండ నన్ను వాసిగా నీ రొమున నుండఁ
జేసియు జల రాసులను నీవు తీసివేయుము మోసములఁ ద్రోసి ||యేసూ||
1. జీవబాధ నే దాఁటుదాఁక నన్ను నీవె దాఁచము నా రక్షక రూపునకు
నడ్పి ప్రోవు మో యేసు దేవ యాత్మను జీవమును జేర్చు ||యేసూ||
2. ప్రాపు లేని నా యాత్మన్ నీవు నీదు దాపునకుఁ జేర్చి ప్రోచి కావు మో
పరమాత్ముఁడా యోపికతోఁ జూచి యాపదలఁ బాపి యాదరించుము
||యేసూ||
3. నా నమ్మకము నీ యందున్నది నీలో నేను గోరు సాయంబున్నది గాన
నేఁ బ్రాపు లేని నా తలను బూని రెక్కల లోన గప్పుము ||యేసూ||
4. యేసు నీవే నాకు సర్వము నీదు దాస జనుల లేవనెత్తుము నీ సుబల
మిమ్మో యేసు రోగులకు వాసిగాఁ జీకు వారలను నడ్పి ||యేసూ||
5. నా వంటి ఘోరపాపి యేడి యేసు నీవంటి పరిశుద్ధుఁ డేడి కేవలము
సత్య భావముతో నిండి నీవు కృపగల దేవుఁడవు స్వామి ||యేసూ||
6. నీదు కృపా బాహుళ్యమందు యేసు నాదు పాపము గప్పుకొందు సాదరం
బగు నీదు మాటల మోదమున శుద్ధి పాదుకొననిమ్ము ||యేసూ||
7. నీవు నిత్యజీవపు టూటవు నాకు జీవజలంబు నిచ్చి కావు మీపు నా
యెదలోఁ గావఁగ లేచి జీవపదవికిఁ ద్రోవ దీయుమా ||యేసూ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసూ నా యాత్మ రక్షకుండ నన్ను Lyrics
Your favourites
- No Favourites found!
