Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యేసూ, యాత్మ ప్రియుఁడానిన్ను నాశ్రయించితిలేవఁగా దరంగముల్గాలివాన Telugu Christian Song Lyrics

యేసూ, యాత్మ ప్రియుఁడానిన్ను నాశ్రయించితిలేవఁగా దరంగముల్గాలివాన Lyrics


1. యేసూ, యాత్మ ప్రియుఁడా
నిన్ను నాశ్రయించితి
లేవఁగా దరంగముల్
గాలివాన కొట్టఁగా
లోకబాధ లన్నిఁటన్
నన్ను దాఁచు రక్షకా
రేపునకు నడ్పుము
నాదు యాత్మన్ బ్రోవుము

2. దిక్కు లేని యాత్మకు
వేఱె ప్రాపు లేదిఁక
ఒంటిగాను విడ్వక
నన్ను నాదరించుమీ
నిన్నె నమ్మి యుంటిని
నీవె నా సహాయము
కాపులేని నా తలన్
కాయుమా నీ నీడను

3. క్రీస్తు నిన్నెఁ గోరుదున్
దొర్కు నన్ని నీ కడన్
పడ్డ హీను నెత్తుమీ
స్వస్థపర్చు రోగులన్
న్యాయశుద్ధ నామము
నీదె, నేను పాపిని
నేను పాపపూర్ణుఁడన్
నీవు ప్రేమారూపివి

4. పాపమెల్ల మాన్పఁగా
నీదు ప్రేమ చాలును
మాన్పు నీళ్లు నాయెదన్
శుద్ధి చేయఁగా నిమ్ము
నీవు బ్రత్కు టూటవు
త్రాగనిమ్ము నీదరిన్
పుట్టి నాదు నాత్మలో
నెల్ల ప్రొద్దు పారుమీ

Your favourites

  • No Favourites found!