యేసువ జయముతో యెరుషలేమున బ్ర వేశము జేసిన యో ప్రభువా
వాసిగ బొగడగ వసుధను జనులు విజయము జేసిన యో ప్రభువా
||యేసువ||
1. మట్టలు బట్టియు బట్టలు బరచియు గట్టిగఁ బాడగ యో ప్రభువా
అట్టహాసముతో అశ్వము నెక్కడ అణఁకువఁ గార్దభ మెక్కిన ప్రభువా
||యేసువ||
2. పిల్లలు పెద్దలు పలుకేకలతోఁ బలికి నుతించగ యో ప్రభువా చల్లగ
వానిని సరియని యొప్పి సంతోషించిన యో ప్రభువా ||యేసువ||
3. కొందరు వారిని తొందరఁ జేయగ కూర్మిని దిద్దిన యో ప్రభువా
అందరు మానిన అరచును రాళ్లని ఆనతి నిచ్చిన యో ప్రభువా ||యేసువ||
4. యెరుషలేం కొరకై యోరిమి జూపియు నేడ్చిన దయగల యో ప్రభువా
యెరుషలేమందున యాలయ మంతను శుభ్రపరచిన యో ప్రభువా
||యేసువ||
5. మా కొఱకై తన ప్రాణము బెట్టిన మాన్యుడవీవె యో ప్రభువా మా
కొరకై ధర మరణము గెల్చిన మహిమ స్వరూపుడ యో ప్రభువా ||యేసువ||
6. మాదు మనస్సును హృదయము నాత్మను నీదిగ గైకొను మో ప్రభువా
సాదర వాక్కులు చక్కఁగఁ బలికియు నాదరించుమము నో ప్రభువా
||యేసువ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసువ జయముతో యెరుషలేమున బ్ర వేశము Lyrics
Your favourites
- No Favourites found!
