యేసువా నా ప్రియమైన ఆత్మ మిత్రుడా - నన్ను
భాసురముగ వేగవచ్చి కౌగలించవే
అను ఆశ నీవేగా నాదు ఆత్మనాథుడా - యేసువా
1. ముండ్ల యందు నుండు వల్లి పద్మమువలె - నిచట
మూర్ఖజనులు నన్నుకొట్టి గాయ పరచినన్
ముద్దు ప్రియుడు యేసునాదు హర్షము
2. ఇద్దరలో యేసు నాకు జల్దరువృక్ష - మిలలో
సదమలుండు ఉత్తముండు పురుషులలోన
ఎదలో క్రొత్తగాలి వలె ప్రేమవీచెను
3. ప్రేమయను ధ్వజము నాకు పైగా నెత్తును - నన్ను
ప్రేమతో రక్షింప నా యొద్ద నిల్చెను
విమల స్వరము వినగా నాశతీరెను
4. లేడిపిల్ల వలె నాదు ప్రియుడు యేసుడు - ఇదిగో
కొండలపై ఎగసిదాటి వచ్చువేగమే
కౌగిలించుకొనును నన్ను వేగమే
5. వర్షఋతువు తీరిపోయెన్ వాన రాదిక - ఎంతో
వింతగాను పుష్పములు పూసియున్నవి
సంతసమున రాజ్యమేల జేర్చును
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యేసువా నా ప్రియమైన ఆత్మ మిత్రుడా Lyrics
Your favourites
- No Favourites found!
