యోగ్యుడా పరిశుద్దుడా అని
మహిమలో ఉన్న శుద్దులే నీకు (2)
సాగిలపడి ఆరాధన చేయ
నిను నేనేరీతిగ ఆరాధింతును (2)
ఆరాధనా…. ఆరాధనా….
ఆరాధనా…. ఆరాధనా….
1. ఎరిగి ఎరిగి నే – చేసిన పాపములు
వీ పావన కాయమును గాయపర్చగా (2)
ఆ గాయాలతోనే స్వస్థత నొసగీ (2)
బ్రతికించిన నీకే అర్పణ నౌదును (2)
ఆరాధనా…. ఆరాధనా….॥ యోగ్యుడా ॥
2. నా గత మెరిగీ – నీ సేవకు పిలువ
బ్రతికించిన నీకే – నా బ్రతుకర్పించక (2)
విసిగించిన నన్ను – సేవలో నిలిపిన (2)
శాశ్వత ప్రేమకే – బానిస నౌదును (2)
ఆరాధనా…. ఆరాధనా…. (2) ॥ యోగ్యుడా ॥
3. ఏ మంచి లేనీ – అయోగ్యుడ నన్ను
నమ్మకస్తునిగా – ఎంచిన ప్రేమచే (2)
నమ్మకమైనా – నా దాసుడు అనే (2)
సాక్ష్యము పొంది – ధన్యుడనౌదును (2)
ఆరాధనా…. ఆరాధనా…. (2) ॥ యోగ్యుడా॥
నీ ప్రేమకు బానిసను Song Audio
