Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యూదా స్తుతిగోత్రపు సింహమాయేసయ్యా నా ఆత్మీయప్రగతి Telugu Christian Song Lyrics

యూదా స్తుతిగోత్రపు సింహమాయేసయ్యా నా ఆత్మీయప్రగతి Lyrics

యూదా స్తుతిగోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయప్రగతి నీ స్వాధీనమా
నీవేకదా నా ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా- ఆరాధనా స్తుతి ఆరాధనా
1.నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను అధముల జేసిన నీకు
అసాధ్యమైనది ఏమున్నది-అసాధ్యమైనది ఏమున్నది? ||యూదా||
2.నీ నీతికిరణాలకై నా దిక్కుదెసలన్నీ నీవేనని
అనతి కాలాన ప్రథమఫలముగా పక్వపరచిన నీకు
అసాధ్యమైనది ఏమున్నది-అసాధ్యమైనది ఏమున్నది? ||యూదా||
3.నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీ
అసాధ్యమైనది ఏమున్నది-అసాధ్యమైనది ఏమున్నది? ||యూదా||

Your favourites

  • No Favourites found!